ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​లో పాడైపోయిన శెనగల పంపిణీ - గుంటూరులో రేషన్​ పంపిణీ తాజా వార్తలు

రేషన్ షాపుల ద్వారా అందించే శెనగలు అధిక శాతం మట్టి గడ్డలు ఉండటమే కాకుండా పుచ్చిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటిని ఎలా తినాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

no quality senaga distribution
పాడైపోయిన శెనగలు

By

Published : May 18, 2020, 4:35 PM IST

ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న సరుకులు నాణ్యత లోపిస్తున్నాయని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సేకురు గ్రామంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ నెంబరు షాపు ద్వారా అందజేస్తున్న శెనగలు బూజు పట్టి, తినేందుకు వీలులేకుండా నల్లగా మారాయి. వాటిని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. సివిల్ సప్లై గోదాం నుంచి వచ్చిన 12 బస్తాలకు, 8 బస్తాల శెనగలు బాగోలేవని డీలర్​ పేర్కొన్నారు. వీటిని కార్డుదారుల ఎదురుగానే ఉంచుతున్నామని, కొంతమంది రైతులు అవే శెనగలు తీసుకెళ్తుండగా, మరికొందరు వద్దని వెళ్లిపోతున్నారని డీలర్ కోటేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details