ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదృశ్యమై 18 రోజులైనా దొరకని చిన్నారి జాడ - girl missing in patibandla village news

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లలో చిన్నారి అదృశ్యం వ్యవహారం అంతుచిక్కడం లేదు. పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నప్పటికీ సరైన విచారణ కోణం, ఆధారాలు లభించకపోవటంతో కేసు సవాలుగా మారింది.

girl missing
girl missing

By

Published : Nov 12, 2020, 9:38 PM IST

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లలో గత నెలలో అదృశ్యమైన పాటిబండ్ల కీర్తి(4) జాడ దొరకలేదు. పోలీసులు ఒక వైపు, తల్లిదండ్రులు మరోవైపు గాలిస్తున్నా పాప ఆచూకీ లభించలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న కీర్తి అదృశ్యమై 18 రోజులైనా... ఇప్పటికీ కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కీర్తి ప్రమాదవశాత్తు ఎక్కడైనా బావిలో పడిపోయిందేమోనన్న అనుమానంతో స్థానికుల సాయంతో గురువారం గ్రామంలోని బావులన్నింటిలో నీటిని తోడి పోలీసులు అన్వేషించారు. అయినా ఫలితం లభించలేదు. తమ బిడ్డను వెతికి అప్పగించాలని కీర్తి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details