కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గుంటూరు నుంచి వెళ్లే ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణికులు అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ఒకరిద్దరు కోసం కూడా బస్సులు నడపాల్సి వస్తోంది. శుక్రవారం నాడు తెనాలి వెళ్లే బస్సులో కేవలం ఒకే ఒక ప్రయాణికుడు ఉన్నారు. అయితే ఒక్కరి కోసం బస్సు నడపటంపై అధికారులు తొలుత సందేహించినా... సమయానికి వెళ్లాలి కాబట్టి అలాగే బయలుదేరింది. మళ్లీ అక్కడినుంచి బుకింగ్స్ ఉంటాయి కాబట్టి సమయానుకూలంగా నడపక తప్పని పరిస్థితి. స్పాట్ బుకింగ్ లేకపోవడం కూడా ప్రయాణికుల సంఖ్య తగడానికి ఓ కారణమని అధికారులు చెబుతున్నారు.
విచిత్ర పరిస్థితి.. ఒక్కరి కోసం ఆర్టీసీ బస్సు - గుంటూరు బస్సులు
లాక్డౌన్ సడలింపుల తర్వాత బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చినా ప్రయాణికులు ఉండటం లేదు. బస్సు ఖాళీగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. స్పాట్ బుకింగ్ లేకపోవడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడం కూడా ఓ కారణమని అధికారులు చెబుతున్నారు.
ఒక్కరి కోసం ఆర్టీసి బస్సు..