"పల్నాడు ప్రశాంతం.. ఎవరినీ అనుమతించం" - chaloatmakur
ఈ నెల 18న మరోసారి చలో ఆత్మకూరుకు తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజున పల్నాడు ప్రాంతంలో ఎవరినీ అనుమతివ్వమని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ అన్నారు.
ఈ నెల 18న పల్నాడు ప్రాంతంలో పర్యటించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ అన్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ని ఆదివారం ఆమె తనిఖీ చేసి పలువురు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి చోట చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని పల్నాడునే ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదన్నారు. పల్నాడు ప్రాంతంలో 15 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు.