గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహం 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన వృద్ధుడు తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 30వ తేదిన మరణించారు. ఆయనకు పిల్లలు కూడా లేకపోవడంతో... బంధువులెవరూ మృతదేహం తీసుకెళ్లేందుకు రాలేదు. దీంతో రెండు వారాలుగా మృతదేహం తెనాలి ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో... ఇవాళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
తెనాలిలో 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోని మృతదేహం - గుంటూరు జిల్లా వార్తలు
తెనాలిలో ఓ మృతదేహం 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోలేదు. తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 30న ఓ వృద్ధుడు మరణించాడు. బంధువులు ఎవరూ రాకపోవడంతో.. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
no cremation for corona dead