ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినా కొందరు పట్టించుకోవటం లేదు. జనం ఎక్కువగా గుమికూడే మార్కెట్లలో కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు అధికారులు చేపట్టడం లేదు. నిత్యం వేలాది మంది వచ్చి పోయే గుంటూరు మిర్చియార్డే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రద్దీగా ఉండే ఈ మార్కెట్లో చాలామంది మాస్కులు ధరించలేదు. యార్డులోకి వచ్చే వారికి కనీసం శానిటైజేషన్ చేయటం లేదు. మిర్చియార్డులో పనిచేసే పాతిక మందికి పైగా ఇప్పటికే కరోనా బారినపడ్డారు. అయినప్పటికీ యార్డులో చాలా మంది మాస్కు ధరించటం లేదు.. కొందరు మాస్కు నామమాత్రానికి ఉన్నట్లు.. సరిగ్గా ధరించటం లేదు. కరోనా జాగ్రత్తలు పాటించకుండా.. ఈవిధంగా కొనసాగిస్తే.. వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
వైరస్ విస్తరిస్తున్నా... మాస్కును మరుస్తున్నారు! - guntur mirchi yard recent news
నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే.. గుంటూరు మిర్చి యార్డులో కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. ఇప్పటికే యార్డులో పనిచేసే కొంతమంది వైరస్ బారిన పడినా.. కరోనా నిబంధనలు పాటించటం లేదు.
గుంటూరు మార్కెట్ యార్డులో.. పాటించని కరోనా నిబంధనలు