కరోనా వైరస్ లక్షణాలతో గుంటూరు ఆస్పత్రిలో చేరిన మంగళగిరికి చెందిన మహిళకు కరోనా లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 13న అమెరికా నుంచి వచ్చిన మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో గుంటూరు ఆస్పత్రిలో చేరారు. ఆమె నమూనాలు పరీక్షలకు పంపి... కరోనా లేదని వైద్యులు నిర్ధరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు.
మంగళగిరి మహిళకు కరోనా లేదని తేల్చిన వైద్యులు
మంగళగిరి మహిళకు కరోనా లేదని వైద్యులు స్పష్టం చేశారు. గుంటూరు ఆస్పత్రి నుంచి మహిళను ఇంటికి పంపించారు. కరోనా అనుమానిత లక్షణాలతో గుంటూరు ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఈ నెల 13న అమెరికా నుంచి వచ్చారు.
mangalagiri mahila
TAGGED:
mangalagiri mahila