ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏ కమిటీ అలా చెప్పలేదు: ఎంవీఎస్ నాగిరెడ్డి

మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తొలగించాల్సిందిగా ఏ కమిటీ చెప్పలేదని వెల్లడించారు.

By

Published : Jan 11, 2020, 12:51 AM IST

Published : Jan 11, 2020, 12:51 AM IST

'No committee has said to remove the capital from Amravati' says nagireddy
'No committee has said to remove the capital from Amravati' says nagireddy

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయబోదని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధానిని తొలగించాల్సిందిగా ఏ కమిటీ చెప్పలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు. జీఎన్ రావు కమిటీ, బీసీజీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించిందని అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధానికి సంబంధించి రైతులు తమకున్న అనుమానాలను, సందేహాలను ఈ కమిటీకి విజ్ఞాపనల ద్వారా అందించాలన్నారు.

మీడియా సమావేశంలో ఎంవీఎస్ నాగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details