45 రోజుల వేట నిషేధం తర్వాత గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద మత్స్యకారులు వేటకు బయలుదేరారు. మత్స్య సంపద పునరుత్పత్తికి ఏప్రిల్ 16 నుంచి వేట నిషేధం విధించిన ప్రభుత్వం...ఈ నెల 1 నుంచి వేటకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనివల్ల ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల మత్స్యకారులు వేట ప్రారంభించారు.
ప్రతి ఏటా నిజాంపట్నం గ్రామ దేవత మొగదారమ్మ తల్లి శిరిమాను ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. అనంతరం శుభ ముహూర్తం చూసుకొని వేటకు బయలుదేరుతారు. కరోనా ప్రభావంతో ఈ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించి... అమ్మవారికి పూజలు చేసి వేటకు బయలు దేరారు. విరామ సమయంలో యజమానులు బోట్లకు మరమ్మతులు చేయించి...వాటిని వేటకు సిద్ధం చేస్తారు. ఒక్కసారి బోటును వేటకు పంపేందుకు రూ. 2 లక్షలు నుంచి రూ. 3 లక్షల ఖర్చు అవుతుందని యజమానులు చెబుతున్నారు.