నివర్ తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నూజండ్లలో 17.6, దుగ్గిరాల 16.4, రేపల్లె 15.4, అమరావతి, నిజాంపట్నంలలో 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో ఈదురు గాలుల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరంలోనూ ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. వేమూరు, చుండూరు, అమృతలూరు, రెంటచింతల, భట్టిప్రోలు, పెదనందిపాడు, దాచేపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తుపాన్ ప్రభావం పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్ఛరికల నేపథ్యంలో.. జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వర్షాలకు పొలాల్లో వరి పంట పాడైపోతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. కొద్దిరోజుల్లో కోతలు చేపట్టాల్సిన సమయంలో వానలు పడటం వారిని కలవరపెడుతోంది.
సముద్రతీరం వెంబడి ఈదురుగాలులు