Nimmagadda Rameshkumar is Fight for Vote: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటుహక్కు కోసం న్యాయపోరాటం చేస్తున్నట్లు.. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. దోస్త్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో రమేష్ పాల్గొన్నారు. అమెరికా వంటి దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ప్రజల మధ్య అనుబంధాలు ఎక్కువన్నారు. తాను పదవీవిరమణ చేశాక స్వగ్రామానికి ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు.
'ఓటు హక్కు కోసం న్యాయపోరాటం చేస్తున్నా'
Nimmagadda Rameshkumar is Fight for Vote: తాను పెరిగింది వేరొక ప్రాంతమైనప్పటికీ.. పుట్టినూరులోనే ఓటు హక్కు కావాలంటూ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.. తనకు ఓటు హక్కు లభించే వరకు న్యాయపోరాటం చేస్తానంటూ.. దుగ్గిరాలలో ఓ సభా కార్యక్రమంలో తెలిపారు.
అమెరికాలో ఒక వ్యక్తి చనిపోతే వందమంది కూడా రారు.సంతాపం తెలపడానికి.. వందమందిగాని వస్తే చాలా ఎక్కువ మంది వచ్చినట్టు ఉండరు.. అదే ఏ గ్రామంలోనైనా సరే.. ఆ గ్రామస్తులు చనిపోతే.. అతనికి సంతాపం తెలిపేందుకు, అతని కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు.. ఎంతోమంది వస్తారు.. ఇదీ గ్రామాల్లో.. పట్టణాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న తేడా.. నేను పుట్టిన నుంచే హైదరాబాద్లో ఉన్నప్పటికీ..మా నాన్న గారు ఉన్నప్పుడు ఈ ఊరికి వచ్చేవాడిని.. ఈ మధ్యే రిటైర్డ్ అయ్యాక ఎక్కువగా వస్తున్నాను.. నా ఆశయం ఏంటంటే దుగ్గిరాల ఓటరుగా రిజిస్టర్ చేయించుకుని.. నా ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో నేను పోరాడుతున్నాను..రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్
ఇవీ చదవండి: