ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Night Curfew: ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ..వాళ్లకు మినహాయింపు - ఏపీలో ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ

AP Night Curfew: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. థియేటర్లలో ఒక సీటు విడిచి మరో సీటులో మాత్రమే ప్రేక్షకులు కూర్చునేలా షరతులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Night Curfew
AP Night Curfew

By

Published : Jan 11, 2022, 1:21 PM IST

AP Night Curfew:కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.

వీరికి మాత్రం మింహాయింపు..

రాత్రిపూట కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసి దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలికమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మింహాయింపులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని ఆదేశాలు..

వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో ఒక సీటు విడిచి మరో సీటులో మాత్రమే ప్రేక్షకులు కూర్చునేలా, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో 200 మందికి మించి పాల్గొనకుండా షరతులు విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Night Curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ.. మాస్కు ధరించకపోతే జరిమానా

ABOUT THE AUTHOR

...view details