ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడాలి' - Nidamarru villagers protest at Mangalagiri Tahasildar office

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గత ఎన్నికల ప్రచారంలో ఇళ్లు తొలగించమని ఎమ్మెల్యే ఆళ్ల హామీ ఇచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయాలని అధికారులు ఆదేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nidamarru  Villagers protest
నిడమర్రు గ్రామస్థులు ఆందోళన

By

Published : Aug 26, 2021, 2:14 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని నిడమర్రు గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిడమర్రు చెరువు కట్టపై వందేళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని.. ఇప్పుడు అకస్మాత్తుగా వాటిని తొలగించాలంటూ అధికారులు ఆదేశించారని బాధితులు వాపోయారు. గత ఎన్నికల ప్రచారంలో ఇళ్లు తొలగించమని ఎమ్మెల్యే ఆళ్ల హామీ ఇచ్చారని.. బాధితులు చెప్పారు.

ఇళ్లు కోల్పోతున్న వారికి మద్దతుగా తెదేపా, వామపక్షనేతలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. లోకేశ్​ అధికారంలోకి వస్తే ఇళ్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందిన ఆర్కే.. ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details