తెదేపా నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందన్న ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన 13 మంది ఖైదీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విడుదల చేసినట్లు తెదేపా నేతలు చేసిన ఫిర్యాదునూ పరిగణలోకి తీసుకున్న కమిషన్... దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. తెదేపా పేర్కొన్న ప్రతి అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా పేర్కొంది. అలాగే పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘటనలపై కూడా పోలీసు, న్యాయశాఖలకు చెందిన ఇద్దరు అధికారులు సందర్శించి అక్కడి బాధితుల పరిస్థితులపై వివరాలు అందించాలని దిశానిర్దేశం చేసింది.
తెదేపా ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ - తెదేపా ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
తెదేపా ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. వీటిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఘటనపై కూడా పూర్తి వివరాలివ్వాలని పోలీసు, న్యాయశాఖలకు దిశానిర్దేశం చేసింది.

తెదేపా ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
ఫిర్యాదులో తెదేపా ఏమని పేర్కొంది..?
తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. పోలీసులు వారిని వేధిస్తూ అడ్డదిడ్డంగా క్రిమినల్ కేసులు బనాయించి భయానక వాతావరణం కలిగిస్తున్నారని తెదేపా ఎంపీలు దిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ కల్పించడానికి 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం నిర్వహిస్తే... పోలీసులు అడ్డకున్న వైనాన్ని వివరించారు.