ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...సీఎంకు కేవీపీ లేఖ - kvp ramachandra rao

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ బహిరంగ లేఖ రాశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడటం ఆనందంగా ఉందని తెలిపారు. మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.

కేవీపీ రామచంద్రరావు

By

Published : Feb 8, 2019, 1:44 PM IST

Updated : Feb 9, 2019, 8:52 AM IST

మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చేది రాహుల్ నేతృత్వంలోని ప్రభుత్వమేనని అన్నారు. సీఎం చంద్రబాబుకు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి కంటితుడుపు లాంటి ప్యాకేజీ ప్రకటించినప్పుడు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీని విమర్శించడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ప్రజల మంచి కోరి ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందమే అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

కేవీపీ బహిరంగ లేఖ
Last Updated : Feb 9, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details