ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలన తీరుపై ప్రజల్లో ఆందోళన: ప్రత్తిపాటి - చిలకలూరి పేట నూతన సంవత్సర వేడుకలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్లొన్నారు. కేక్​ కట్​ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

celebrations at pathipati residency
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

By

Published : Jan 2, 2021, 7:02 AM IST

వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన చేస్తోందని.. ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన గృహంలో తెదేపా కార్యకర్తలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన హాజరయ్యారు. కేక్​ కోసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2020వ సంవత్సరం ప్రతి ఒక్కరినీ కష్టాలలోకి నెట్టిందని... 2021లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ఉన్న వైకాపా ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసే మంచి మనసు కలగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details