అమరావతి రైతులు
కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా రాజధాని ప్రాంతంలో జై అమరావతి నినాదం ప్రతిధ్వనించింది. దీక్షా శిబిరాల వద్దే రైతులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. రంగవల్లులపై సేవ్ అమరావతి అంటూ గీశారు. కొత్త ఏడాదిలోనైనా పాలకుల మనసు మార్చి అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చూడాలని ప్రార్థించారు. దీక్షా శిబిరాల వద్ద కేక్ కట్ చేసి ఆంగ్ల సంవత్సరాదిని స్వాగతించారు.
తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన 20 మంది రైతులు మహారాష్ట్రలో ఉన్న షిర్దీ సాయి ఆలయానికి వెళ్లారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.