గుంటూరు జిల్లాలో సాగునీటి కాల్వల నుంచి విడుదలయ్యే నీటి లెక్కింపు కోసం అధికారులు ఎన్-9 అనే కొత్త పరికరాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజి కాలువల్లో పరిక్షిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో దుగ్గిరాల కాలువ వద్ద నీటి విడుదలను ఈ పరికరం ద్వారా లెక్కించారు.
గతంలో ఉన్న వాటి కంటే కొత్త పరికరం నీటి విడుదలను ఖచ్చితంగా లెక్కిస్తుందని అధికారులు తెలిపారు. పనితీరుని బట్టి అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరికరాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాలువల నుంచి విడుదలయ్యే నీటి విషయంలో ఎక్కువ, తక్కవ అని రైతుల్లో అపోహలు వస్తున్నాయని... కొత్త పరికరం ద్వారా అలాంటి వాటికి తావుండదని వివరించారు.