ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త రైల్వే ట్రాక్ తొలిదశ పనులు పూర్తి - నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే ట్రాక్​ పూర్తి

నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు చేపట్టిన నూతన రైల్వే ట్రాక్​ తొలిదశ పనులు పుర్తయ్యాయి. ఈ ట్రాక్​పై గుంటూరు జిల్లా న్యూ పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు.

new railway track open in new piduguralla
కొత్త రైల్వే ట్రాక్ తొలిదశ పనలు పూర్తి

By

Published : Mar 19, 2020, 2:39 PM IST

కొత్త రైల్వే ట్రాక్ తొలిదశ పనలు పూర్తి

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్​ నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి దశలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. కొత్త ట్రాక్​ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అనంతరం న్యూ పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు రైలు నడిపారు. రేపు రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు నడపనున్నారు. పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 600 కోట్ల వ్యయంతో 45.85 కిలోమీటర్ల కొత్త ట్రాక్​ను నిర్మించినట్లు దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ మేనేజర్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details