ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

New Problems with Online Registration in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో.. కొత్త అనుమానాలు! సందేహాలను తీర్చాల్సిందేనంటున్న.. కొనుగోలు దారులు - ఆంధ్రప్రదేశ్​లో ఆస్తి నమోదు

New Problems with Online Registration in AP: ఏపీలో భూలావాదేవీలకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో.. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ కొత్త ఆన్​లైన్ విధానంతో రిజిస్ట్రేషన్​లో ఆస్తిపత్రాలు చేతికి రావన్న అంశం.. ఇప్పుడు యజమానుల్లో గుబులు రేపుతోంది. అటు తాము కూడా ఉపాధి కోల్పోతామని డాక్యుమెంట్ రైటర్లు ఉద్యమబాట పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెరపైకి వచ్చిన వివాదాలపై సర్కార్ స్పందన ఎలా ఉంటుందో ఆసక్తిగా మారింది

New_Problems_with_Online_Registration
New_Problems_with_Online_Registration

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 9:01 AM IST

Updated : Sep 1, 2023, 9:49 AM IST

New Problems with Online Registration in AP :రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైన ఆన్‌లైన్‌లో దస్తావేజులను రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం కాస్త సంక్లిష్టంగా ఉంది. ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా ఆన్‌లైన్‌ విధానాన్ని రూపొందించారు. ఆన్‌లైన్‌లో క్రయ, విక్రయదారుల వివరాలను నమోదు చేయగానే వారి సెల్‌ఫోన్లకు ఓటీపీ వస్తుంది. వీరు ఎంత మంది ఉంటే.. అంత మందికి వారి ఆధార్‌ నంబరుకు అనుసంధానమైన సెల్‌ఫోన్లకు ఓటీపీ ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో ఆ సంఖ్యను నమోదు చేయాలి.

Property Buyers Worried about New Online Registration :నిర్ణీత వ్యవధిలో ఏ ఒక్కరు ఓటీపీ నమోదు చేయకపోయినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. ఆ వివరాలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తాయి. స్లాట్‌ బుకింగ్‌కు అనుగుణంగా క్రయ, విక్రయదారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు చెప్పాలి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అనంతరం మెయిల్‌ లేదా సెల్‌ఫోన్‌కు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వెంటనే పంపుతుంది. దీనిని ప్రింట్‌ తీసుకోవాలి.

Sub Registration Offices: సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నరకం.. డబ్బులు తీసుకుంటారు.. కానీ వసతులు కల్పించరు.

ప్రస్తుతం మాదిరిగా స్టాంపు పేపరుపై ముద్రణ ఉండదు. సాధారణ తెల్లకాగితాలపైనే ముద్రించిన వివరాలు ఉంటాయి. ఈ విధానంలో తనఖా సంస్థలు, బ్యాంకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావచ్చన్న ఆందోళనను ఆస్తుల కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విధానంలో ఇచ్చే డాక్యుమెంట్‌కు, ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చే డాక్యుమెంట్‌కూ పొంతనలేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

దస్తావేజులో వివరాల నమోదులో తప్పులు దొర్లితే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుత విధానంలో దస్తావేజుల్లో తప్పులు దొర్లితే.. అక్కడి వరకు క్రయ, విక్రయదారుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ అవకాశం ఉండదు. ఈ అధికారాన్ని సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో గిఫ్ట్, మార్ట్‌గేజ్‌ తాలూకు నమూనాలను మాత్రమే అందుబాటులో ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే ‘ఐజీఆర్‌ఎస్‌ ’ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

Second Day Document Writers Protest: రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం.. దస్తావేజు లేఖర్ల ఆందోళన

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మిగిలిన జిల్లాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకురావాల్సిన తేదీలను జిల్లాలకు పంపించారు. ఇప్పటికే పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం అమల్లో ఉంది. ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారానికి అనుగుణంగా వివరాలు పూర్తిచేసి, ప్రింట్‌ తీసుకుని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే.. తగిన ఆధారాలు పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

అమ్మో మర్రిపాలెమా..! అక్కడ కొన్న స్థలాలకు రిజిస్ట్రేషన్ కావడం లేదు,ఎందుకో తెలుసా..!.

తాజాగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానంలో వివరాలు నమోదు చేయడమే కాకుండా జతపరిచే లింక్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లే సమయంలో జతపరిచిన ఆధారాలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. సెప్టెంబరు 15కు ముందు వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వివరాల నమోదు ఆన్‌లైన్‌లో జరిగేలా, అనంతరం ప్రజలు నేరుగా నమోదు చేసుకునేలా అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ క్రమంలో వచ్చే సాంకేతిక సమస్యలను గుర్తించి సరిచేయాలన్న ఆలోచనలో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దశాబ్దాలుగా వాడుకలో ఉన్న 10, 20, 50, 100 రూపాయలు విలువ చేసే నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పత్రాల స్థానంలో ఈ-స్టాంపు విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. త్వరలోనే వీటి విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుత ఆన్‌లైన్‌ విధానంలోనూ డాక్యుమెంట్‌కు స్టాంప్‌ అవసరం అసలు లేకుండా పోయింది.

రిజిస్ట్రేషన్లు చేయాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందే..!

New Problems with Online Registration in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో.. కొత్త అనుమానాలు! సందేహాలను తీర్చాల్సిందేనంటున్న.. కొనుగోలు దారులు
Last Updated : Sep 1, 2023, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details