ఏపీ హైకోర్టుకు నూతనంగా ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులుగా జె.సుమతి, వి.సుజాత, టి.కిరణ్ లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. నిన్న ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను ఆమోదించిన ప్రభుత్వం.. వెంటనే వారి స్థానాల్లో నూతన ప్రభుత్వ న్యాయవాదులను నియమించింది. హైకోర్టులో పీపీలుగా పనిచేస్తున్న పెనుమాక వెంకట్రావు, గెడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ లు నిన్న రాజీనామా చేయగా.. ప్రభుత్వం ఆ రాజీనామాలను వెంటనే ఆమోదించింది. వారి స్థానంలో నూతన న్యాయవాదులను నియమిస్తూ ఉత్యర్వులు జారీ చేసింది.
హైకోర్టుకు ముగ్గురు నూతన ప్రభుత్వ న్యాయవాదులు - హైకోర్టుకు ముగ్గురు నూతన ప్రభుత్వ న్యాయవాదులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు నూతన ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జె.సుమతి, వి.సుజాత, టి.కిరణ్ లను నూతన ప్రభుత్వ న్యాయవాదులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి వేతనం నెలకు లక్ష రూపాయలుగా జీవోలో పేర్కొన్నారు.
New Government Lawyers
TAGGED:
ఏపీకి కొత్త న్యాయవాదులు