గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో జిల్లాలో కొత్తగా 12 కేసులు నమోదు అయితే, అందులో 6 కేసులు నరసరావుపేటకు చెందినవే ఉన్నాయి. వీటితో పట్టణంలో వైరస్ బాధితుల సంఖ్య 173కి చేరుకుంది.
తాజాగా నమోదైన 6 కేసుల్లో.. 3 వరవకట్ట, 2 ప్రకాష్ నగర్, ఒకటి కొండలరావు పేటకు చెందినవారని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రకటించిన మిషన్ మే 15 కార్యక్రమం ప్రకారం.. ఈ నెల 15కి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులను జీరో స్థాయికి తెస్తామని తెలిపారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆ స్థాయికి రావటం కష్టమే అని అభిప్రాయం వెల్లడవుతోంది.