గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,160కి చేరుకుంది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 630కి పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 65,291మంది కోలుకున్నారు. కొవిడ్‌తో అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది.
గుంటూరులో కొత్తగా 323 పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి - corona cases in guntur news
గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,160కి చేరింది. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు.
![గుంటూరులో కొత్తగా 323 పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి covid cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9460387-257-9460387-1604711148022.jpg)
కరోనా పాజిటివ్ కేసులు
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 93 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. మండలాల వారీగా.. సత్తెపల్లి-19, రేపల్లె-18, తెనాలి-16, తాడేపల్లి-14, పొన్నూరు-13 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 150 కేసులు వచ్చాయని బులిటెన్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య