గుంటూరు జిల్లాలో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 62,501కి చేరుకుంది. అత్యధికంగా నగరంలో 85 కేసులున్నాయి. నరసరావుపే-26; మంగళగిరి, బాపట్ల-18; డేపల్లి, చిలకలూరిపేట- 17; రేపల్లె-16; పెదకాకాని- 15; పొన్నూరు- 13; నకరికల్లు-10 కేసులు బయటపడ్డాయి.
గుంటూరు జిల్లాలో కొత్తగా 390 కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా 390 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.
గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
జిల్లాలో ఇప్పటివరకు 56,362 మంది కోలుకోగా, మొత్తం మరణాల సంఖ్య 573కి చేరింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎక్కువ మరణాలు ఉన్న జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: అన్నదాతల జీవితాలు అతలాకుతలం