గుంటూరు కలెక్టర్గా శామ్యూల్ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం గుంటూరుకు బదిలీ చేసింది. దీంతో కలెక్టరేట్లోని ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్ శాఖలలో ఇప్పటివరకూ పని చేశానని.. మిగిలిన అంశాలపై కూడా అవగాహన పెంచుకుని జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా స్థాయి అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాల విజయవంతానికి కృషి చేస్తానని అన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయగా.. కుటుంబ సభ్యులు, అధికారులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
గుంటూరు కలెక్టర్గా శామ్యుల్ ఆనంద్ బాధ్యతల స్వీకరణ - new collcetor joing ... shamyl anandh
ప్రభుత్వ ప్రాధాన్యతలే.. తన ప్రాధాన్యతలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పేర్కొన్నారు.
నూతన కలెక్టర్గా శ్యాముల్ ఆనంద్... బాధ్యతలు స్వీకరణ