గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 533 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 53వేల 920కి చేరింది. జిల్లాలో కొత్తగా 2 మరణాలు సంభవించగా.. మొత్తం మరణాల సంఖ్య 511కి చేరుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 45వేల 355మంది ఇళ్లకు చేరుకున్నారు.
జిల్లాలో కొత్తగా 533 కరోనా కేసులు.. నగరంలో అత్యధికం - జిల్లాలో కొత్తగా 533 కరోనా కేసులు.. నగరంలో అత్యధికం
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 533 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోనే అత్యధికంగా 70 కేసులు రాగా.. నరసరావుపేటలో 63 మందికి పాజిటివ్‌గా తెలినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాలో కొత్తగా 533 కరోనా కేసులు.. నగరంలో అత్యధికం
ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే అత్యధికంగా 70 కేసులు రాగా.. నరసవుపేటలో 63 ఉన్నాయి. కొల్లూరు 41, మంగళగిరి 33, సత్తెనపల్లి 27, తెనాలి 26, తుళ్లూరు 23, పొన్నూరు 19, తాడేపల్లి 19, నకరికల్లు 19, రెంటచింతల 18, ఎడ్లపాడు 18, చుండూరు 13, మాచర్లలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 134 కేసులు వచ్చినట్లు తెలిపారు.