జీజీహెచ్‌లో నాలుగేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స - ggh latest news
మీ ఇంట్లో సూదులు, చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, హానికరమైన వాటిని పిల్లలకు అందేలా ఉంచుతున్నారా? అయితే ఇది మీ కోసమే... ఇంట్లో చిన్నారి ఆడుకుంటూ వస్త్రాలు కుట్టే సూదిని మింగేసింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది సూదిని బయటకు తీశారు.
జీజీహెచ్‌లో నాలుగేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స నిర్వహించారు. వస్త్రాలను కుట్టేందుకు వినియోగించే సూదిని చిన్నారి మింగేసింది. బాలికను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎండోస్కోపీ విధానం ద్వారా కేవలం 8 నిమిషాల్లో సూదిని వైద్యులు బయటకు తీశారు. చిన్నారిని కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన వైద్యురాలు కవితను ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు.