ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రెయిన్​లో గల్లంతయిన యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు - డ్రెయిన్ లో గల్లంతయిన యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు

రేపల్లె డ్రెయిన్​లో ఇద్దరు యువకులు గల్లంతవ్వగా... ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గేదెలు కడిగేందుకు డ్రెయిన్​లోకి దిగిన యువకులు లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయారు. ఇప్పటి వరకూ వారి ఆచూకీ లభించలేదు.

missing in repalle drain
డ్రెయిన్ లో గల్లంతయిన యువకులు

By

Published : Nov 16, 2020, 2:11 PM IST

గుంటూరు జిల్లాలో రేపల్లె డ్రెయిన్​లో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామానికి చెందిన యామినేని సాయి సునీల్, యామినేని చామంత్ నిన్న సాయంత్రం గేదెలు కడిగేందుకు డ్రెయిన్ లోకి దిగారు. నీళ్ల లోతు ఎక్కువగా ఉండటంతో చామంత్ మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన సాయి సునీల్ కూడా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు.

ఇద్దరి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ కు సమాచారం ఇచ్చారు. వారు ఈ రోజు ఉదయం మోటార్ బోట్ల సాయంతో వెతకటం ఆరంభించారు . కానీ ఇప్పటి వరకూ యువకుల ఆచూకీ లభించలేదు.

ABOUT THE AUTHOR

...view details