ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుబాబుల్ రైతులకు మద్దతు ధర కల్పించండి' - navataram party leadr meets mp krishnadevarayalu

సుబాబుల్ రైతులకు మద్దతు ధర కల్పించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కోరారు. ఆయన ఎంపీని కలిసి వినతి పత్రం అందజేశారు.

navataram party leader meets mp lavu sri krishnadevarayalu
ఎంపీతో రావు సుబ్రమణ్యం

By

Published : Sep 9, 2020, 9:37 AM IST

సుబాబుల్ రైతులకు ప్రభుత్వం ప్రటించిన మద్దతు ధర దక్కేలా చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి విజ్ఞప్తి చేశారు. టన్ను సుబాబుల్​ను వ్యాపారులు రెండు వేలకే కొనుగోలు చేస్తున్నారనీ.. కూలీలు చెల్లించగా రైతుకు టన్నుకు 1300 మాత్రమే మిగులుతోందని ఎంపీకి వివరించారు. మద్దతు ధర టన్నుకి 4,400 ఉన్నప్పటికీ.. వ్యాపారులు సగం ధరకే కొనుగోలు చేయటం వలన రైతులకు తీవ్ర నష్టం వస్తోందని తెలిపారు. వెంటనే స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్​తో చర్చించారు. పేపర్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి సుబాబుల్ రైతులకు మద్దతు ధర చెల్లించేలా చూడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details