సాధారణంగా దేవాలయాలు, విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనేది ప్రభుత్వ నిబంధన.. కానీ అందుకు విరుద్ధంగా పాఠశాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఏకంగా.. విద్యాబుద్ధులు నేర్చుకునే సరస్వతీ నిలయాన్నే కొందరూ.. సారా తయారీ కేంద్రంగా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు.
గుంటూరు: ప్రభుత్వ పాఠశాలలో నాటుసారా తయారీ.. పలువురి అరెస్టు - హారిస్‌పేట ప్రభుత్వ పాఠశాలలో నాటుసారా తయారీ
16:17 July 24
ప్రభుత్వ పాఠశాలలో నాటుసారా తయారు చేస్తున్న ముఠా అరెస్టు
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం హారిస్‌పేటలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నాటుసారా తయారు చేస్తున్న ముఠాను ఎస్‌ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని హారిస్‌పేటలో నాటు సారా మాఫియా బరితెగించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా సెలవు కావడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలను తెరవడంలేదు. ఇదే అదునుగా భావించిన నాటుసారా తయారీదారులు.. బడి ఆవరణలోనే సారా తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు.. తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేసి సారా తయారీకి ఉపయోగించే ముడి సరకు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల ప్రాంగణాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి..
'కుటుంబ సభ్యులే చంపాలని చూశారు.. ఆ ఘటనతో నా ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు'