జాతీయ యవ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అవంతి కొత్త ఆలోచనలతో యువత ముందుకు సాగాలని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ యవ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి విభేదాలను వీడి అంతా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
సంక్రాంతి వేడుకల్లో మంత్రి
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి అవంతి గుంటూరు జిల్లా తెనాలిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అవంతి భోగి మంటలు వేశారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి అవంతి తెలిపారు. ఈ పండుగ అందరికీ శుభం చేకూర్చాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:
సామజవరగమన'కు టీచర్ పేరడి.. నెట్టింట వైరల్