గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో పర్యటించింది. వీరిలో కమిషన్ వైస్ ఛైర్మన్ హల్దార్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఉన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను బృంద సభ్యులు కలిశారు. రమ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వినతుల స్వీకరణ..
రమ్య ఇంటి నుంచి బయల్దేరిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం.. ఆర్‌అండ్‌బీ అతిథిగృహనికి చేరుకున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులను.. రాజధాని రైతులు కలిశారు. రాజధాని మార్పుతో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎస్సీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు.