ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్ నిర్ణయాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టింది' - Pattupati Pullaravu news

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను జాతీయ మీడియా కూడా తప్పుబట్టిందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే... ముఖ్యమంత్రి జగన్‌ మరోవైపున ఉన్నారని ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Jan 31, 2020, 6:38 PM IST

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ప్రజలంతా ఒకవైపు ఉంటే... ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం మరోవైపున ఉన్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ప్రజల మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోని నేతగా సీఎం జగన్‌ మిగిలిపోతారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టిందని గుర్తుచేశారు. అమరావతికి మద్దతుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి సమీపంలో దీక్ష చేస్తున్న అన్నదాతలకు... మరో మాజీమంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో కలసి ఆయన సంఘీభావం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details