ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లూథరన్ చర్చిల ఆస్తులను కాపాడాలి - జాతీయ క్రిస్టియన్ బోర్డు - జాతీయ క్రిస్టియన్ బోర్డు సమావేశం

National Christian Board: లూథరన్ చర్చిల ఆస్తులను కాపాడాలని జాతీయ క్రిస్టియన్ బోర్డు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. కొందరు అక్రమంగా భూములను విక్రయిస్తూ కోట్ల రూపాయలను సంపాదించారని ఆరోపించారు. త్వరలోనే ఇరు ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామని బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మార్క్ చెప్పారు.

జాతీయ క్రిస్టియన్ బోర్డు
జాతీయ క్రిస్టియన్ బోర్డు

By

Published : Feb 20, 2022, 5:31 PM IST

National Christian Board: ఎంతో విలువైన లూథరన్ చర్చిల ఆస్తులను సంరక్షించాలని జాతీయ క్రిస్టియన్ బోర్డు తెలుగు రాష్ట్రాలను కోరింది. హైదరాబాద్​లో నిర్వహించిన జాతీయ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలో విస్తరించి ఉన్న లూథరన్ చర్చిల ఆస్తులను అమ్ముకునేందుకు భారీ కుట్రలు చేస్తున్నారని బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మార్క్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ హోంమంత్రి సుచరిత, బ్రదర్ అనిల్ పేర్లు చెబుతూ.. లాజరస్ అబ్రహం అనే వ్యక్తి ఏపీలో 150 ఎకరాల భూములను విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పలు పోలీసు స్టేషన్​ల్లో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ చర్యలకు పాల్పడుతున్న లాజరస్ అబ్రహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అతనిపై ఏపీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అబ్రహం అక్రమాలపై త్వరలోనే డీజీపీని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details