గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదు రోజులపాటు జరిగిన 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. వివిధ రాష్ట్రాల నుంచి యువ అథ్లెట్లు హోరాహోరీగా పోటీపడిన ఈ క్రీడోత్సవంలో హరియాణా జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. ఆ జట్టు 407 పాయింట్లు సాధించి ఆల్ రౌండర్‌గా సత్తా చాటింది. తమిళనాడు, కేరళ జట్లు ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు 15వ స్థానంలో నిలవగా... తెలంగాణ జట్టు 10వ స్థానంలో నిలిచింది. 200 మీటర్ల పరుగుపందెంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు షణ్ముగం శ్రీనివాస్ మరోసారి సత్తా చాటాడు. లక్ష్యాన్ని 21.34 సెకన్లలో చేరి రికార్డు నెలకొల్పాడు. తెలంగాణకు చెందిన మహేశ్వరి 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. వరంగల్ అమ్మాయి దీప్తి డబుల్ ఢమాకా సాధించింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికే స్వర్ణం సాధించిన ఆమె.. 200 మీటర్ల పరుగులోనూ రజత పతకాన్ని గెలిచింది. ఏపీకి చెందిన ఝాన్సీ 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించింది. విజేతలకు, ఉత్తమ అథ్లెట్లకు... ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు ట్రోఫీలు అందజేశారు.
35 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌గా హరియాణా - sports in guntur
గుంటూరులో ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన 35 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి.
ముగిసిన 35 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు