గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన విద్యార్థిని అనూష హత్యను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. 8 గంటల నుంచి పల్నాడులోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నా.. ఏ ఒక్క అధికారి, ప్రభుత్వ పెద్దలు స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో ఇలాంటి ఘటన జరిగితే ఊరుకుంటారా అని విద్యార్థులు ప్రశ్నించారు.
నరసరావుపేట విద్యార్థిని హత్యను నిరసిస్తూ ధర్నా - గుంటూరు డిగ్రీ విద్యార్థిని హత్య వార్త
నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్యకు నిరసనగా విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అనూష కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నరసరావుపేట విద్యార్థిని హత్యను నిరసిస్తూ ధర్నా
నరసరావుపేటలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి నిందితుడికి శిక్ష పడేలా చేయాలని.. ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ధర్నా ఆపే ప్రసక్తి లేదని.. ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురవుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా