గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం పటిష్టతపై నీలినీడలు కమ్ముకున్నాయి. 200 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.. ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయ గోపురంలోని 6, 7వ అంతస్తులో పగుళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో గోపురం పటిష్టతపై మద్రాస్ IIT నిపుణులతో పరిశీలిన చేయించారు. భారీ వాహనాల రాకపోకల వల్ల ఆ శబ్దాలకు గోపురంలో వైబ్రేషన్స్ వస్తున్నాయని నిపుణులు గుర్తించారు. ఆలయం చుట్టూ రాకపోకలు నిషేధించాలని సూచించారు. కొన్నిరోజులు వాహన రాకపోకలను నిషేధించారు. అధికారులు నిర్లక్ష్యంతో మళ్లీ వాహన రాకపోకలు పెరిగాయి. భారీ వాహనాలకు తోడు రాత్రివేళల్లో ఇసుక లారీలు కూడా ఈ మార్గం గుండా రావడంతో గోపురంలో మళ్లీ పగుళ్లు రావడం మొదలయ్యాయి. ఇక గత నెలలో కురిసిన వర్షాలకు.... ఆలయ ప్రహరీ కూలింది గాలిగోపురంలో పగుళ్లు, కట్టుబడి రాళ్ల మధ్య ఏర్పడుతున్న ఖాళీలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం గోపురంలోని 6,7అంతస్తులో పగుళ్లు పెరుగుతున్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. ఇనుప వైర్లతో గట్టిగా కట్టారు. ఆలయం చుట్టూ వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ మాడ వీధుల్లో వాహనాలు రాకుండా గడ్డర్లు బిగించారు. ఆలయ పటిష్టత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Mangalagiri Temple: మంగళగిరి నారసింహుని గోపురానికి పగుళ్లు...
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం పటిష్టతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఆలయ గోపురంలోని 6, 7వ అంతస్తులో పగుళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
నారసింహుని గోపురానికి పగుళ్లు...మరమ్మత్తులు చేస్తున్న అధికారులు