రాబోయే కాలంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మతకక్షలు తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇంఛార్జీ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభిమానుల మనోభావాలను దెబ్బతీసేందుకే నాయకుల విగ్రహాలను తొలగించే ప్రక్రియను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిందని అరవిందబాబు ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.