సడలించిన నాణ్యతా ప్రమాణాల ఉత్తర్వుల ప్రకారం దెబ్బ తిన్న ధాన్యానికి ప్రస్తుతం అనుమతిస్తున్న 5 శాతం పరిమితి నుంచి మరో 5 శాతం కలిపి మొత్తం 10 శాతం గరిష్టంగా అనుమతించారని నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ తెలిపారు. వీటికి గ్రేడ్ల వారీగా మద్దతు ధరపై 5 శాతం వరకు ధరలు తగ్గించి ఇవ్వనున్నట్లు వివరించారు.
పంట దెబ్బతిన్న రైతులు భయపడకుండా వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని కోరారు. నమోదైన వివరాల ప్రకారం నరసరావుపేట డివిజన్లో ఏర్పాటు చేసిన 22 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులెవరూ మధ్యవర్తుల మాటలు విని ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకుని మోసపోవద్దని సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ సూచించారు.