గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నర్సింగపాడులో బీబీసీ ఫామ్ వద్ద మొక్కలు నాటారు. సమీపంలోని గేదెలు, ఆంబోతుల స్థావరాలు సందర్శించారు. త్వరలో బ్రీడింగ్ సెంటర్ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెటింగ్ శాఖ గోడౌన్ను ప్రారంభించారు. మండల కేంద్రంలో 88 లక్షలతో నిర్మించిన వైద్యశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఎంపీతో పాటుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.