గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెటిన జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా, హౌసింగ్ పథకాల అమలుపై చర్చించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు బ్యాంకుల ద్వారా 10వేల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు.
'జగనన్న చేదోడు పథకం రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది' - జగనన్న తోడు పథకం
జగనన్న చేదోడు పథకం ద్వారా ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్లో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు నిధుల మంజూరు గురించి చర్చించారు.
జగనన్న తోడు పథకం రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది
జగనన్న చేదోడు పథకానికి ఇప్పటివరకు 5 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటితో పాటు మిగిలిన పథకాలకు అందిన దరఖాస్తులను బ్యాంకు మేనేజర్లకు అందజేశామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్లు అప్లికేషన్లను త్వరగా పరిశీలించి లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు.