ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NARA LOKESH: పవర్ లిఫ్టర్ సాధియాకు నారా లోకేష్ అభినందనలు - telugu news

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి స్వర్ణ పథకం సాధించిన సాధియాను నారా లోకేశ్ అభినందించారు. తనకు చేతనైనా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

nara-lokesh-wishes-to-power-lifter-sadhiya
పవర్ లిఫ్టర్ సాధియాకు నారా లోకేష్ అభినందనలు

By

Published : Dec 27, 2021, 12:08 PM IST

అంత‌ర్జాతీయ ప‌వ‌ర్‌ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన సాధియాకు... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరికి చెందిన సాధియా స్వర్ణ పతకం సాధించ‌డం ఆనందంగా ఉందన్నారు. సాధియా ఈ ఘ‌న‌త సాధించ‌డంలో తండ్రి, కోచ్‌ షేక్ సంధాని పాత్ర ఎన‌లేనిదని లోకేశ్‌ కొనియాడారు. అంత‌ర్జాతీయ పోటీల్లో స‌త్తాచాటుతున్నసాధియాకి చేత‌నైనంత సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన సాధియా

ABOUT THE AUTHOR

...view details