గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిశీలించారు. నివర్ వెలిసి వారం రోజులైనా మురుగు నీరు పోయే మార్గం లేక పంటలను పూర్తిగా కోల్పోయామని రైతులు లోకేశ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రాప్‌లో తమ పేర్లు నమోదు కాలేదని... అధికారులు పంట నష్ట పరిహారంలో తమ పేర్లు నమోదు చేయడం లేదని వాపోయారు.
పూర్తిగా నష్టపోయాం.. పరిహారం అందలేదు: లోకేశ్‌తో రైతులు - గుంటూరు జిల్లాలో లోకేశ్ పర్యటన
గుంటూరు జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. పచ్చలతాడిపర్రులో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. వరుస తుపాన్లు, వరదల వల్ల పూర్తిగా నష్టపోయామన్న రైతులు.. ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![పూర్తిగా నష్టపోయాం.. పరిహారం అందలేదు: లోకేశ్‌తో రైతులు nara lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9770598-587-9770598-1607145739567.jpg)
nara lokesh
పూర్తిగా నష్టపోయాం.. పరిహారం అందలేదు: లోకేశ్‌తో రైతులు
ఇదీ చదవండి:
Last Updated : Dec 5, 2020, 11:04 AM IST