.
'వాళ్లు వస్తే ఎందుకు భయపడుతున్నారు సీఎం గారు'? - రాజధాని మహిళలపై పోలీసులు అరాచకాలు
మహిళలపై పోలీసుల తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆడపడుచులను బూటు కాలుతో తన్నటంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 144 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లల్లో బందించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముసుగులో జరిగిన అరాచకాలను కమిషన్ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

నారా లోకేష్