Lokesh Started Road Works In Mangalagiri: ప్రజాసేవ చేయాలనే తపన ఉండాలే కానీ.. అధికారం అక్కర్లేదని నిరూపించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. వైకాపా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన సొంత నిధులతో రహదారి నిర్మించి స్థానికులచే ప్రశంసలందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ జులై 28, 29 తేదీల్లో 'బాదుడే బాదుడు' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.
మాట నిలబెట్టుకున్న లోకేశ్.. సొంత నిధులతో రహదారి - రహదారి పనులు ప్రారంభించిన లోకేశ్
Road Works In Mangalagiri:వైకాపా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజవర్గంలో నారా లోకేశ్ తన సొంత నిధులతో రహదారి నిర్మించి స్థానికులచే ప్రశంసలందుకున్నారు. అధికారం లేకపోయినా ప్రజల బాధలను పరిష్కరించినందుకు లోకేశ్‌కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు రోజు నగరంలో భారీ వర్షాలు కురవటంతో ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ మురికి కూపంగా మారాయి. రత్నాల చెరువు కాలనీలో లోకేశ్ చేపలు పట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన లోకేశ్ వారం రోజుల్లో రహదారి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇవాళ రహదారి పనులను ప్రారంభించారు. లోకేశ్ తన సొంత నిధులతో రహదారి నిర్మించటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారం లేకపోయినా ప్రజల బాధలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి