ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LOKESH PHONE: ధైర్యం కోల్పోవద్దు..అండగా ఉంటాం: నారా లోకేశ్​ - Nara Lokesh phoned gang rape girl father

గుంటూరు జిల్లాలో గ్యాంగ్‌రేప్‌కి గురైన బాలిక తండ్రికి నారా లోకేశ్ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. ధైర్యం కోల్పోవ‌ద్దని.. పాప‌కి మంచి వైద్యం చేయించాలని సూచించారు. నిందితుల్ని శిక్షించేవ‌ర‌కూ పోరాడ‌దామన్నారు.

Nara Lokesh
నారా లోకేశ్

By

Published : Aug 20, 2021, 12:16 PM IST

గుంటూరు జిల్లా రాజులపాలెంలో గ్యాంగ్‌రేప్‌కి గురైన బాలిక తండ్రికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. తన కూతురికి జరిగిన అన్యాయంపై బాలిక తండ్రి లోకేశ్ వద్ద విలపించారు. ధైర్యం కోల్పోవ‌ద్దని.. పాప‌కి మంచి వైద్యం చేయించాలని సూచించారు. అన్నివిధాలా అండ‌గా ఉంటానని హామీ ఇచ్చారు. మ‌రో అమ్మాయికి ఇలా జ‌ర‌గ‌కుండా పోరాటం చేద్దామన్నారు. నిందితుల్ని శిక్షించేవ‌ర‌కూ పోరాడ‌దామన్నారు.

ABOUT THE AUTHOR

...view details