ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబం తోడుగా.. లోకేశ్ నామినేషన్ వేయగా! - #apelections2109

మంగళగిరి శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది కార్యకర్తలు తోడుగా లోకేశ్ ర్యాలీ చేశారు.

వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్తున్న లోకేశ్

By

Published : Mar 22, 2019, 5:40 PM IST

వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్తున్న లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ నియోజకవర్గతెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్.. వేడుకగానామినేషన్ దాఖలు చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి... నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లారు. ఉండవల్లి నుంచి మంగళగిరి వరకు తెలుగుదేశం శ్రేణులు వేలాదిగా మంత్రి వెంట కదిలారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్.. రెండు సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న లోకేష్​కు అండగా.. అశేష సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో పాటు... ఆయనతల్లిభువనేశ్వరి, భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్.. తోడుగా వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details