ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుడు కేసులకు భయమొద్దు... అండగా మేమున్నాం: లోకేశ్

తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలపై వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని... ఆ పార్టీ ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించిన లోకేశ్... పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు.

తప్పుడు కేసులకు భయపడొద్దు...అండగా మేమున్నాం : లోకేశ్

By

Published : Oct 29, 2019, 10:40 PM IST

దుగ్గిరాల మండలంలో లోకేశ్ పర్యటన

వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై తప్పుడు కేసులు పెట్టి... బెదిరిస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద్దపాలెం, శృంగారపురం గ్రామాల్లో పర్యటించిన లోకేశ్... ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించినా... ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా సత్తా చూపాలని లోకేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details