జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌డీసీ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ కేంద్రంగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఎన్‌హెచ్‌డీసీ బ్రాంచ్ కార్యాలయం విజయవాడలో స్థాపించిన నాటి నుంచి చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదల నమోదు చేసి ప్రాంతీయ కార్యాలయంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 200కి పైగా చేనేత సహకార సంస్థలు, అనుబంధ సంస్థలకు చేకూర్చిందన్నారు. తెలంగాణ ఎన్‌హెచ్‌డీసీ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్ 16 కోట్ల రూపాయల వరకు ఉంటే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్ 80 కోట్ల రూపాయల వరకు ఉందన్నారు.
కేంద్ర మంత్రి స్మతి ఇరానీకి నారా లోకేశ్ లేఖ - handloom workers problems in ap
జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌డీసీ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ కేంద్రంగా కొనసాగించాలంటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు నారా లోకేశ్. కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల హైదరాబాద్ ఎన్‌హెచ్‌డీసీ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయంగా కుదించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో తిరిగి ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విజయవాడ కార్యాలయం స్థాయి తగ్గించినందున సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, నూలు డిపో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఆరు నెలల్లో కరోనా మహమ్మారి ఖాదీ, చేనేత రంగాన్ని నాశనం చేసినందున చేనేత కార్మికులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కాబట్టి విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను - నారా లోకేశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి