గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.
Lokesh tour: నేడు నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటన - nara lokesh comments on ramya murder case
గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. చట్టప్రకారం 21రోజుల్లో నిందితుడిని ఉరి తీస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది.
nara lokesh narsaraopeta tour
లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. విమానాశ్రయంలోనే లోకేష్‌ను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నలుగురు ఏసీపీలు, సుమారు వంద మంది పోలీసు బలగాలను అందుబాటులో ఉంచినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచే పోలీసులు కసరత్తు చేపట్టగా.. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు
ఇదీ చదవండి:
Results: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
Last Updated : Sep 9, 2021, 5:27 AM IST